గుర్తింపు కార్డుల్లో ఆధార్ ఎందుకు చేర్చలేదు.. ఈసీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
అమరావతి, 10 జూలై (హి.స.)బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడే విధంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. జూన్ 25న బీహార్‌లో ఎన్నికల సంఘం ప్రత్
Supreme Court


అమరావతి, 10 జూలై (హి.స.)బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడే విధంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. జూన్ 25న బీహార్‌లో ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం తర్వాతే రాజకీయ దుమారం చెలరేగింది. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహారిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా సవరణకు పూనుకుంది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పది పిటిషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గురువారం ధర్మాసనం విచారణ చేపట్టగా.. ఈ సందర్భంగా పోల్ కసరత్తు సమయాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆధార్ కార్డును మినహాయించడంపై ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఈసీ తప్పనిసరి చేసిన 11 పత్రాల జాబితాలో ఆధార్ కార్డు ఎందుకు లేదనే దానిపై ప్రత్యక్ష సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం నుంచి వివరణ కోరింది. 10 పిటిషన్లను న్యాయమూర్తులు సుధాంషు ధులియా, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande