ప్రధాని మోడీకి అపూర్వ గౌర‌వం – వ‌రిస్తున్న అత్యున్న‌త పుర‌స్కారాలు
న్యూఢిల్లీ, 10 జూలై (హి.స.) ప్రధాని మోదీ తన విదేశీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని గురువారం ఢిల్లీ వ‌చ్చేశారు. ఈ ప‌ర్య‌ట‌నలో ఆయ‌న‌కు అరుదైన గౌరవాలు ల‌భించాయి. ఒకే పర్యటనలో ఏకంగా మూడు దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను (civil awards ) స్వీకరించారు. బ్రెజ
ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, 10 జూలై (హి.స.)

ప్రధాని మోదీ తన విదేశీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని గురువారం ఢిల్లీ వ‌చ్చేశారు. ఈ ప‌ర్య‌ట‌నలో ఆయ‌న‌కు అరుదైన గౌరవాలు ల‌భించాయి. ఒకే పర్యటనలో ఏకంగా మూడు దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను (civil awards ) స్వీకరించారు. బ్రెజిల్ (Brazil) , నమీబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రధాని మోదీకి అందించి సత్కరించాయి. 2014లో అధికారంలోకి వచ్చినప్ప‌టి నుంచి మోదీ విదేశీ ప్రభుత్వాల నుంచి అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య దీంతో 27కు చేరింది.ఆర్థిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించేందుకు..మొత్తం 8 రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాతో సహా ఐదు దేశాలను సందర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande