యూఎస్ వస్తువులపై బ్రెజిలియన్ సుంకాలు
,ఢిల్లీ,10 జూలై (హి.స.)బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పట్ల ఆ దేశం అవమానిస్తున్న తీరుకు అక్కడి ఎగుమతులపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక, ట్రంప్ ప్రకటన తర్వాత కొద్దిసేపటికే బ్రెజిల్ అధ్యక్
యూఎస్ వస్తువులపై బ్రెజిలియన్ సుంకాలు


,ఢిల్లీ,10 జూలై (హి.స.)బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పట్ల ఆ దేశం అవమానిస్తున్న తీరుకు అక్కడి ఎగుమతులపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక, ట్రంప్ ప్రకటన తర్వాత కొద్దిసేపటికే బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు. అందులో సుంకాలను ఏకపక్షంగా పెంచే ఏ చర్యకైనా బ్రెజిల్ ఆర్థిక చట్టం ప్రకారం ప్రతిస్పందించబడుతుంది అని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలో యూఎస్ వస్తువులపై బ్రెజిలియన్ సుంకాలు విధించవచ్చని సంకేతాలు ఇచ్చింది. అలాగే, బ్రెజిల్ యొక్క స్వేచ్ఛా పూరిత ఎన్నికలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై అమెరికన్లు కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని లూయిజ్ ఇన్సియో ఆరోపించారు.

ఢిల్లీ

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande