హైదరాబాద్, 10 జూలై (హి.స.)
: గురుపౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే బాబా దర్శనం కోసం క్యూలైన్లలో వేచిఉన్నారు. క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని హనుమకొండ, నల్గొండ, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట.. ఏపీలోని కర్నూలు, విజయవాడ తదితర ప్రాంతాల్లోని సాయి మందిరాల్లో భక్తుల రద్దీ కనిపించింది. మహారాష్ట్రలోని షిర్డీ ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ