ట్రంప్‌ పై డ్రోన్‌తో దాడి చేస్తాం: ఇరాన్‌ వార్నింగ్‌
హైదరాబాద్, 10 జూలై (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదని ఇరాన్‌ (Iran) పేర్కొంది. ఈసందర్భంగా ఆయన అక్కడ సన్‌బాత్‌ చేసే సమయంలో లక్ష్యంగా చేసుకుంటామని ఆ దేశ సీనియర్‌ అధికారి ఒకరు హె
US


హైదరాబాద్, 10 జూలై (హి.స.)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదని ఇరాన్‌ (Iran) పేర్కొంది. ఈసందర్భంగా ఆయన అక్కడ సన్‌బాత్‌ చేసే సమయంలో లక్ష్యంగా చేసుకుంటామని ఆ దేశ సీనియర్‌ అధికారి ఒకరు హెచ్చరించారు. ఇటీవల ఇరాన్‌ అణుకేంద్రాలపై యూఎస్‌ పెద్దఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) సలహాదారు జావద్‌ లారిజాని (Javad Larijani) ఈ హెచ్చరికలు చేశారు. స్థానిక మీడియాలో ఆయన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి. ట్రంప్‌నకు ఫ్లోరిడాలోని మార్‌-ఎ-లాగో రిసార్ట్‌ కూడా ఇకపై సురక్షితం కాదని లారిజాని పేర్కొన్నారు. అధ్యక్షుడు సన్‌బాత్‌ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్‌ ఆయన్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. ఇది చాలా సులభమైన పని అని వ్యాఖ్యానించారు. 2020లో ఇరానియన్‌ టాప్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్‌ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande