కూకట్పల్లి కల్తీ మద్యం సంఘటన.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్, 10 జూలై (హి.స.) కూకట్పల్లిలో కల్తీ మద్యం సేవించిన సంఘటనలో మరణించిన వారి సంఖ్య ఆరుగురికి పెరిగింది. మృతుల్లో స్వరూప(56), తులసీరామ్(47), బొజ్జయ్య(55), నారాయణమ్మ(65), మౌనిక(25), నారాయణ ఉన్నారు. వీరంతా హెచ్ఎంటీ హిల్స్లోని సాయిచరణ్ కాలనీకి చె
కల్తీ కల్లు


హైదరాబాద్, 10 జూలై (హి.స.)

కూకట్పల్లిలో కల్తీ మద్యం సేవించిన సంఘటనలో మరణించిన వారి సంఖ్య ఆరుగురికి పెరిగింది. మృతుల్లో స్వరూప(56), తులసీరామ్(47), బొజ్జయ్య(55), నారాయణమ్మ(65), మౌనిక(25), నారాయణ ఉన్నారు. వీరంతా హెచ్ఎంటీ హిల్స్లోని సాయిచరణ్ కాలనీకి చెందినవారిగా గుర్తించారు. తీవ్ర అస్వస్థతతో గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా బాధితుల ఆరోగ్యంపై నిమ్స్ ఆసుపత్రి తాజాగా హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. కల్తీ కల్లు సేవించిన మొత్తం 31 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అందులో 27 మంది పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. మరో నలుగురికి డయాలసిస్ ట్రిట్మెండ్ కొనసాగుతోందని వెల్లడించారు. మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande