హైదరాబాద్, 10 జూలై (హి.స.)
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో ఎంపీలకు 40 శాతం కోటా కేటాయించాలని బిజెపి ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు రఘునందన్ రావు సీఎంకు ఇవాళ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని పేదలు, బలహీన వర్గాల ప్రజలకు నూతన గృహాలను అందించేందుకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ప్రారంభిస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులను అనుసంధానించడం సానుకూలమైన పరిణామం అని అన్నారు. ఇప్పుడు మీరు లబ్ధిదారుల ఎంపికలో స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలకు 40 శాతం కోటా కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్