న్యూఢిల్లీ, 10 జూలై (హి.స.)
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసింది. ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో మోదీ పర్యటించారు. బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ.. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించి పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నమీబియా పర్యటనతో ఆయన విదేశీ టూర్ ముగిసింది. దీంతో మోదీ ఢిల్లీ బయలుదేరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..