హైదరాబాద్, 10 జూలై (హి.స.)
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలపై RTC MD సజ్జనార్ ఫైర్ అయ్యారు. 'యువత బంగారు భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు? మంచి పనులు చేసి యూత్కు ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి యువత మరణాలకు కారణమయ్యారు. మీరు బెట్టింగ్ ప్రోత్సహించడం వల్లే యువత బంధాలు, బంధుత్వాలు మరిచిపోయారు. కాసులకు కక్కుర్తి పడే మీ ధోరణి సరైనది కాదు' అంటూ మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్