మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. తల్లిని రైతువేదికలో వదిలేసిన కొడుకులు.
మహబూబాబాద్, 10 జూలై (హి.స.) మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భూపతి పేట గ్రామంలో కన్న తల్లిని కాదన్న కొడుకుల ఘటన గురువారం చోటుచేసుకుంది. తల్లిని సాకలేము అంటూ నలుగురు కొడుకులు కలిసి వృద్ధతల్లిని గ్రామంలోని రైతు వేదికలో వదిలి పెట్టారు. కొడుకులు దూర
కన్నతల్లి


మహబూబాబాద్, 10 జూలై (హి.స.)

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భూపతి పేట గ్రామంలో కన్న తల్లిని కాదన్న కొడుకుల ఘటన గురువారం చోటుచేసుకుంది. తల్లిని సాకలేము అంటూ నలుగురు కొడుకులు కలిసి వృద్ధతల్లిని గ్రామంలోని రైతు వేదికలో వదిలి పెట్టారు. కొడుకులు దూరం పెట్టిన కన్నతల్లి రైతువేదికలో తల దాచుకుంటుంది. ఆమె పరిస్థితిని చూసి స్థానికులు కొడుకులు చేసిన పని పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande