రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు – లారీ ఢీ.. ఇద్దరి దుర్మరణం
హైదరాబాద్, 10 జూలై (హి.స.) లారీ కారును ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తూరు ఎస్ఐ గోపాల కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం పరిధిలోని జాండగూడెం గ్రామ తాజా మ
రోడ్డు ప్రమాదం


హైదరాబాద్, 10 జూలై (హి.స.)

లారీ కారును ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తూరు ఎస్ఐ గోపాల కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం పరిధిలోని జాండగూడెం గ్రామ తాజా మాజీ సర్పంచ్ పరిగి చంద్రశేఖర్ రెడ్డి(50), నందిగామ మండల పరిధిలోని దేవుని మామిడిపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి (45)తో కలిసి బుధవారం రాత్రి కారులో జాండగూడెం గ్రామానికి బయల్దేరారు.మార్గం మధ్యలో కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే వంతెన సమీపంలోకి రాగానే కొత్తూరు నుండి షాద్ నగర్ వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో పరిగి చంద్రశేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.దేవుని మామిడిపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 108 వాహనంలో హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. పరిగి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు పరిగి మహేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గోపాల కృష్ణ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande