కర్నూలు 10 జూలై (హి.స.)
:జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్ద బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‍ను స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ