ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. భారీగా ట్రాఫిక్ జామ్.
ఢిల్లీ 10 జూలై (హి.స.)దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వానకు నగరం అతలాకుతలం అయింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్ని ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు తీవ్ర ఇక్క
ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. భారీగా ట్రాఫిక్ జామ్.


ఢిల్లీ 10 జూలై (హి.స.)దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వానకు నగరం అతలాకుతలం అయింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్ని ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మోకాలి లోతు నీటితో రహదారులు నిండిపోయాయి. ఇక విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక గురు, శుక్రవారాల్లో భారీగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

బుధవారం సాయంత్రం నుంచే ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం వరకు భారీగా వర్షం కురిసింది. దీంతో నగర వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి. గురువారం ఉదయమే ఉద్యోగాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇక విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఢిల్లీ ఎయిర్‌పోర్టు తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande