ఎమర్జెన్సీ సమయంలో ప్రజల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాం హరించబడ్డాయి: ఎంపీ శశిథరూర్
తిరువనంతపురం, 10 జూలై (హి.స.)కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు ఆ
Shashi Tharoor

తిరువనంతపురం, 10 జూలై (హి.స.)కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన. ఎమర్జెన్సీ ప్రకటించడం ఒక చీకటి అధ్యాయం.. ఆ చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, ఎమర్జెన్సీ సమయంలో అందరి స్వేచ్ఛను హరించారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచి వేసే ప్రయత్నం చేశారని ప్రాజెక్టు సిండికేట్‌ అనే వెబ్‌సైట్‌లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఓ వ్యాసం రాశారు.

ఇక, దేశంలో అంతర్గత గందరగోళాన్ని తొలగించడం కోసం బయటి నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ లాంటి కఠినమైన నిర్ణయం తప్పనిసరి అని మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని ఆలోచించి.. తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. కానీ, ఈ తప్పుడు విధానాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయని చెప్పుకొచ్చారు. దాదాపు జూన్ 21 నెలల పాటు కొనసాగిన అత్యవసర పరిస్థితిలో పౌరుల స్వేచ్ఛ, మీడియా, ప్రతిపక్ష నేతలు పూర్తిగా అణిచివేయబడ్డారని తెలిపారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన. ఎమర్జెన్సీ ప్రకటించడం ఒక చీకటి అధ్యాయం.. ఆ చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, ఎమర్జెన్సీ సమయంలో అందరి స్వేచ్ఛను హరించారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచి వేసే ప్రయత్నం చేశారని ప్రాజెక్టు సిండికేట్‌ అనే వెబ్‌సైట్‌లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఓ వ్యాసం రాశారు.

ఇక, దేశంలో అంతర్గత గందరగోళాన్ని తొలగించడం కోసం బయటి నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ లాంటి కఠినమైన నిర్ణయం తప్పనిసరి అని మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని ఆలోచించి.. తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. కానీ, ఈ తప్పుడు విధానాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయని చెప్పుకొచ్చారు. దాదాపు జూన్ 21 నెలల పాటు కొనసాగిన అత్యవసర పరిస్థితిలో పౌరుల స్వేచ్ఛ, మీడియా, ప్రతిపక్ష నేతలు పూర్తిగా అణిచివేయబడ్డారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande