ముంబై, 10 జూలై (హి.స.)దేశీయ మార్కెట్లు మరో రోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ మన సూచీలు స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 91 పాయింట్ల నష్టంతో 83,430 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 39 పాయింట్ల నష్టంతో 25,436 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.61 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, అపోలో హాస్పిటల్స్, సిప్లా స్టాక్స్ నష్టాల్లో కదలాడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ