జాగృతి రైల్ రోకో నిరవధిక వాయిదా.. సర్కార్ కు వారం గడువు
హైదరాబాద్, 11 జూలై (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బీసీ బిడ్డలు, తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ విజయం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్, 11 జూలై (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బీసీ బిడ్డలు, తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ విజయం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్టినెన్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తాము నిర్వహించతలపెట్టిన రైల్ రోకోను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కవిత.. ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్ ను ఆమోదించకుండా గవర్నర్ ఆపితే మళ్లీ రైల్ రోకో తప్పదని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande