తెలంగాణ, భూపాలపల్లి. 12 జూలై (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హర్షనీయమని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ శ్రేణులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కలిసి, మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని, బలహీన వర్గాల హక్కుల కోసం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రణాళికలో కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42శాతం రిజర్వేషన్ తెర మీదకు తీసుకువచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగన చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు