వికారాబాద్, 12 జూలై (హి.స.) వికారాబాద్ జిల్లా కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రామ జన్మభూమి కార్యక్రమంలో కరసేవలో పాల్గొన్న ధరూర్ మండలం అంపలి గ్రామానికి చెందిన వైద్యనాథ్, (65) శనివారం మృతి చెందారు. వైద్యనాథ్ మృతి పట్ల జిల్లా బిజెపి నాయకులు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్త వైద్యనాథ్ మృతి బిజెపి పార్టీకి తీరని లోటని స్థానిక నాయకులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్