హైదరాబాద్, 11 జూలై (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42
శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ను నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి బీసీల తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీతో పాటు శాసనమండలిలో స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం పంపిందని అన్నారు. కానీ, బిల్లుపై వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే 2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తుందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సర్కార్ నిర్ణయం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలపాలని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..