హైదరాబాద్, 11 జూలై (హి.స.)
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి
ప్రాంతంలో సంచలనం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటివరకు ఈ కల్తీ మద్యం సేవించి తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన బాధితుల సంఖ్య 51కి చేరింది. గాంధీ ఆస్పత్రిలో 14 మంది బాధితులకు ఇంకా చికిత్స కొనసాగుతోంది. నిమ్స్ 34 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురికి పరిస్థితి విషమంగా ఉండటంతో డయాలసిస్ నిర్వహిస్తున్నారు. అలాగే, ESI ఆస్పత్రిలో ఒకరు, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు.
ఇక కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి సంఖ్య 9కి పెరిగింది.కాగా ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో బాలానగర్ ఆబ్కారీ శాఖ అధికారులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. కల్తీ మద్యం తయారీ, విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..