గుజరాత్లో బ్రిడ్జ్ కూలిన ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
గుజరాత్, 11 జూలై (హి.స.) గుజరాత్లో బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. ఈ మేరకు వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ కోసం.. రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు కొనసాగుతుందని స్పష్టం చేశ
గుజరాత్లో బ్రిడ్జ్


గుజరాత్, 11 జూలై (హి.స.)

గుజరాత్లో బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. ఈ మేరకు వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ కోసం.. రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు బాధితులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. మిగిలిన మృతదేహాలు స్లాబ్ కింద చిక్కుకున్నాయని, వారిని వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే చిక్కుకున్న ట్రక్కు డ్రైవర్ కూడా కనిపించడం లేదని, అతని మృతదేహాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. నది మధ్యలో, 3 నుంచి 4 మీటర్లు ఇసుక ఉందని, ఇది రెస్క్యూ బృందానికి సవాల్గా మారిందని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande