చెన్నై, 12 జూలై (హి.స.): ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 27న రాష్ట్రానికి విచ్చేయనున్నారు. గంగైకొండ చోళపురంలో జరిగే వేడుకల్లో ఆయన ముఖ్య అథిగా పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఆయన ఢిల్లీకి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 26న కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో నరేంద్రమోదీ పాల్గొంటారు.
అక్కడి నుంచి మరుసటి రోజు ఆయన రాష్ట్రానికి రానున్నారు. అరియలూరు జిల్లా గంగైకొండ చోళపురంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బృహదీశ్వరాలయాన్ని చోళచక్రవర్తి రాజేంద్ర చోళుడు నిర్మించారు. ఆ ఆలయంలో ఈ నెల 27న ఆషాఢ ఆరుద్ర మహోత్సవాలు నిర్వహించనున్నారు. రాజేంద్ర చోళుడి జయంతి కూడా ఆరోజే కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా ఈ వేడుకలను జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ