దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల తయారీకి రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధి
న్యూఢిల్లీ, 12 జూలై (హి.స.) దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్
దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల తయారీకి రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధి


న్యూఢిల్లీ, 12 జూలై (హి.స.)

దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమార స్వామి ఈ విషయం ప్రకటించారు. రాష్ట్రాలతో చర్చించిన తర్వాత ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదానికి పెడతామని ఆయన చెప్పారు.

అయితే రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల తయారీకి రెండు కంపెనీలను మాత్రమే ఎంపిక చేయనున్నట్టు కుమార స్వామి తెలిపారు. రేర్‌ ఎర్త్‌ ఖనిజాల ఉత్పత్తి, వాటిని శుద్ధి చేయడం, శుద్ధి చేసిన ఖనిజాల నుంచి తుది ఉత్పత్తులైన రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల తయారీ వరకు అన్ని దశల్లోనూ కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే వినియోగించి పారేసిన రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్లను కరిగించి ఆ భస్మంతో మాగ్నెట్లను తయారు చేసేలా కంపెనీలను ప్రోత్సహించడం తమ లక్ష్యమని ప్రభుత్వం

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande