సౌభాగ్యం, శాంతి, సమృద్ధిని కలగజేయాలనే భావనతో గ్రామదేవతకు బోనాలు..ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా
తెలంగాణ, నిజామాబాద్. 11 జూలై (హి.స.) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో సౌభాగ్యం, శాంతి, సమృద్ధిని కలగజేయాలనే భావనతో గ్రామదేవ తకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందనీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా అన్నారు. వ
నిజామాబాద్ ఎమ్మెల్యే


తెలంగాణ, నిజామాబాద్. 11 జూలై (హి.స.)

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో సౌభాగ్యం, శాంతి, సమృద్ధిని కలగజేయాలనే భావనతో గ్రామదేవ తకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందనీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా అన్నారు. వినాయక్ నగర్ లో శుక్రవారం నిర్వహించిన మహాలక్ష్మి అమ్మ వారి బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణ గుప్తా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యా ప్తంగా ఆషాడమాసంలో ప్రజలందరు భక్తి శ్రద్దలతో బోనం చేసి అమ్మవారిని కోలిస్తే స్వయంగా అమ్మవారే తమ ఇం టికి వస్తుందని భక్తులందరు నమ్మకంగా భావిస్తారని అన్నారు. అమ్మ దయతో సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని పిల్లజల్లా, గొడ్డు గోదా అన్నింటిని కాపాడాలని అమ్మవారిని పూజించడం జరుగుతుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande