పార స్పోర్ట్స్ .అసోసియేషన్.ఆధ్వర్యంలో జూలై 20 న పారా జూనియర్ సబ్ జూనియర్ అథలిటిక్స్
అమరావతి, 11 జూలై (హి.స.) విజయనగరం రింగ్ రోడ్డు: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జులై 20న పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలు రాజీవ్ క్రీడా మైదానంలో జరుగనున్నాయని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు. శ
పార స్పోర్ట్స్ .అసోసియేషన్.ఆధ్వర్యంలో జూలై 20 న పారా జూనియర్ సబ్ జూనియర్ అథలిటిక్స్


అమరావతి, 11 జూలై (హి.స.)

విజయనగరం రింగ్ రోడ్డు: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జులై 20న పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలు రాజీవ్ క్రీడా మైదానంలో జరుగనున్నాయని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు. శుక్రవారం జిల్లా క్రీడాధికారి ఎల్. వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్‌తో కలిసి పోటీలకు సంబంధించిన పోస్టర్స్‌ను విడుదల చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆగష్టులో 14వ జాతీయ స్థాయి జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2025 పోటీలు జరుగనున్నాయన్నారు. ఈ పోటీలకు అర్హత సాధించేందుకు ముందుగా జిల్లా స్థాయిలో ఎంపిక కావాల్సి ఉంటుందన్నారు. 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు దివ్యాంగ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు ఆగష్టు 9న విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రధానంగా రన్నింగ్, షాట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో పోటీలు నిర్వహిస్తారని చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న పారా క్రీడాకారులంతా ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న వారు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు 98493-77577 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సారథి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ప్రదీప్, పారా క్రీడాకారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande