కాలేశ్వరం కమిషన్ విచారణపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ పై విమర్శలు..!
హైదరాబాద్, 11 జూలై (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్కు సంబంధించి మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ తో జరిగిన జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ప్రాజెక్టు పనులు పూర్తిగా
హరీష్ రావు


హైదరాబాద్, 11 జూలై (హి.స.)

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్కు సంబంధించి మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ తో జరిగిన జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ప్రాజెక్టు పనులు పూర్తిగా క్యాబినెట్ ఆమోదంతోనే జరిగాయన్నారు. మెడిగడ్డ పనులకు క్యాబినెట్ ఆరు సార్లు ఆమోదం తెలిపింది. అలాగే శాసనసభలో కూడా మూడుసార్లు ఆమోదం పొందింది. ఈ విషయాలకు సంబంధించి డాక్యుమెంట్లను పూర్తిగా కమీషన్కు అందజేశాం. కానీ, కమీషన్కు ఇచ్చిన ఆ డాక్యుమెంట్లను మాకు కాపీ ఇవ్వాలని సెక్రటరీని అడిగాను అని తెలిపారు. అలాగే, నేను సీఎస్, జీఎడీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీలకు లేఖ రాసాను. కానీ ముగ్గురి నుంచి సరైన సమాధానం రాలేదు. అసలు కమీషన్కు నిజమైన వివరాలు ఇస్తున్నారా..? లేదా..? అనే అనుమానం వస్తోందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande