నదిలో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు
తెలంగాణ, నిర్మల్. 11 జూలై (హి.స.) నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది లో ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నించిన యువకుడిని శుక్రవారం పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా షాపూర్ గ్రామానికి చెందిన నాందేవ్ దే
బాసర పోలీసులు


తెలంగాణ, నిర్మల్. 11 జూలై (హి.స.) నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద

గోదావరి నది లో ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నించిన యువకుడిని శుక్రవారం పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా షాపూర్ గ్రామానికి చెందిన నాందేవ్ దేవిదాస్ ఇంట్లో గొడవల కారణంగా గోదావరి నదిలో దూకేందుకు బాసరలోని రెండవ ఘాట్ వద్ద అనుమానాస్పదంగా ఉండడంతో గమనించిన స్పెషల్ పార్టీ పోలీసులు క యువకుని నచ్చజెప్పి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కౌన్సెలింగ్ నిర్వహించారు. చిన్నపాటి గొడవల కారణంగా ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని, కుటుంబంలోని పెద్దల సమక్షంలో మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. యువకుడిని కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande