ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజారక్షణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్
తెలంగాణ, మంచిర్యాల. 11 జూలై (హి.స.) ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని
కలెక్టర్ కుమార్ దీపక్


తెలంగాణ, మంచిర్యాల. 11 జూలై (హి.స.)

ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భారీ వర్షాలు సంభవించినప్పుడు ఏర్పడే వరదలు, విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు, ఆస్తులు నష్టపోకుండా సత్వరమే సేవలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.వరదలు, విపత్తులు సంభవించినప్పుడు సహాయం కోసం ప్రజలు కంట్రోల్ రూమ్ నం.08736- 250501 లో సంప్రదించవచ్చని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande