పీర్జాదిగూడ మినీ ట్యాంక్ బండ్ పెద్ద చెరువులో వలస పక్షుల సందడి..
హైదరాబాద్, 11 జూలై (హి.స.) మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మినీ ట్యాంక్ బండ్ పెద్ద చెరువు వద్ద వలస పక్షులు సందడి చేస్తున్నాయి. అనేక జాతుల పక్షులు ఇక్కడకు చేరుకున్నాయి. పక్షుల కిల కిలలతో ట్యాంక్ బండ్ పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. పక
వలస పక్షుల సందడి


హైదరాబాద్, 11 జూలై (హి.స.)

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్

కార్పొరేషన్ మినీ ట్యాంక్ బండ్ పెద్ద చెరువు వద్ద వలస పక్షులు సందడి చేస్తున్నాయి. అనేక జాతుల పక్షులు ఇక్కడకు చేరుకున్నాయి. పక్షుల కిల కిలలతో ట్యాంక్ బండ్ పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడకు వలస వచ్చి పిల్లలతో సందడి చేస్తున్నాయి. సాయంత్రం వేల పక్షులను చూడటానికి ప్రజలు, చిన్నారులు చేరుకొని ఆహ్లాదాన్ని అనందిస్తున్నారు.

ఒకపక్క చెరువు కలుషితం కావడంతో దుర్వాసనకు ఇబ్బందులు పడుతున్నారు. అలానే చెరువులో ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోవడంతో వలస పక్షులకు ప్రమాదం సంభవిస్తుందేమో అని అక్కడకు చేరుకున్న వాళ్ళు బయపడుతున్నారు. సంబంధిత అధికారులు వలస పక్షులు ప్రమాదాలపాలు పడకుండా చర్యలు చేపట్టాలని పక్షులను తిలకించడానికి వచ్చినవారు కోరుతున్నారు.చెరువు ఇలానే ఉంటే రాను రాను పక్షుల వలసలు కూడా తగ్గిపోతాయని ప్రజలు అభిప్రాయాపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande