ఇదేనా అమ్మకు ఇచ్చే గౌరవం? తల్లిని రోడ్డున పడేశారు : వీసీ సజ్జనార్ ట్వీట్
మహబూబాబాద్, 11 జూలై (హి.స.) మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతి పేట గ్రామంలో దీనస్థితిలో ఉన్న కన్న తల్లికి తిండి పెట్టకుండా రైతు వేదికలో ఆమె కొడుకులు వదిలి వెళ్లిపోయిన విషాద ఘటన పై తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఐపీఎస్.. తన ఎక్స్
సజ్జనర్


మహబూబాబాద్, 11 జూలై (హి.స.) మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతి పేట గ్రామంలో దీనస్థితిలో ఉన్న కన్న తల్లికి తిండి పెట్టకుండా రైతు వేదికలో ఆమె కొడుకులు వదిలి వెళ్లిపోయిన విషాద ఘటన పై తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఐపీఎస్.. తన ఎక్స్ ఖాతా వేదికగా

అమ్మా.. నీకెంత కష్టం.. అంటూ వార్త పోస్ట్ చేశారు. .

78 ఏళ్ల వయసులో కాలు కదపలేని స్థితిలో ఉన్న కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు కర్కశకులుగా మారి ఆమెను రోడ్డున పడేశారని ఆవేదన చెందారు. ఇదేనా అమ్మకు ఇచ్చే గౌరవం? అని ప్రశ్నించారు. నవమాసాలు కని పెంచిన అమ్మ అన్న కనికరం కూడా కొడుకులకు లేకపోవడం బాధాకరమని ఆవేదన తెలిపారు. కాగా, కన్న తల్లికి తిండి పెట్టకుండా రైతు వేదికలో వదిలేసిన కొడుకులపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాంటి కొడుకులు ఉన్న ఒకటే, సచ్చిన ఒకటే అని కామెంట్స్ పెట్టారు. ఆ తల్లిని ఆదుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్, స్థానిక పోలీసులకు ఎక్స్ వేదికగా నెటిజన్లు ట్యాగ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande