హైదరాబాద్, 11 జూలై (హి.స.)
కూకట్పల్లిలో కల్తీ కల్లు సంఘటన నేపద్యంలో కల్తీ కల్లు సరఫరా చేసిన కల్లు దుకాణాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. వాటిపై యాక్షన్ తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేయడంతో బాలనగర్ ఎక్సెస్ పోలీసులు ఈ రోజు కూకట్ పల్లిలోని షంషిగూడ, హైదర్నగర్, భాగ్య నగర్, సర్దార్ పటేల్ నగర్, సాయిచరణ్ కాలనీలోని కల్లు దుకాణాలను సీజ్ చేసి సీల్ వేశారు. సంఘటన చోటు చేసుకుని, పలువురు అస్వస్థతకు గురైన వెంటనే కల్లు దుకాణాలకు తాళం వేసి శాంపిల్స్ సేకరించిన అధికారులు, కల్లు లో మత్తు పదార్థాలు పెద్ద మోతాదులో కలిసినట్టు రుజువు అవడంతో శుక్రవారం వాటిని సీజ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..