జమ్మూకశ్మీర్‌లో ఆశావహ పరిస్థితులు,ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్య
కోల్‌కతా: , 11 జూలై (హి.స.)పహల్గాం ఉగ్ర దాడి అనంతరం తమ రాష్ట్రంలో పర్యాటకం తిరిగి పుంజుకోవడంతో ఆశావహ వాతావరణం నెలకొందని జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘మా విషయంలో 2025 సంవత్సరం అంత తేలిగ్గా సాగలేదు. పహల్గాం దాడి అనంతరం జమ్మూ
J&K CM Omar Abdullah


కోల్‌కతా: , 11 జూలై (హి.స.)పహల్గాం ఉగ్ర దాడి అనంతరం తమ రాష్ట్రంలో పర్యాటకం తిరిగి పుంజుకోవడంతో ఆశావహ వాతావరణం నెలకొందని జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘మా విషయంలో 2025 సంవత్సరం అంత తేలిగ్గా సాగలేదు. పహల్గాం దాడి అనంతరం జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకం కథ కంచికి చేరకుండా మరింతగా పుంజుకుంది’ అని తెలిపారు. గురువారం కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పర్యాటక రంగానికి ఇదొక కొత్త ప్రారంభమని చెప్పారు. ‘రాష్ట్రంలో పహల్గాం దాడికి పూర్వం హోటళ్లన్నీ నిండి ఉండేవి. దాల్‌ సరస్సులో పడవలు కిక్కిరిసి ఉండేవి. ఉగ్ర దాడి అకస్మాత్తుగా పరిస్థితిని తలకిందులు చేసింది. అయితే అనతి కాలంలోనే పరిస్థితి తిరిగి సాధారణంగా మారింది’ అని ఒమర్‌ పేర్కొన్నారు. మరోవైపు తన కోల్‌కతా పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఒమర్‌ భేటీ అయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande