దిల్లీ: 11 జూలై (హి.స.)కాంగ్రెస్ (Congress)లో కొనసాగుతూ ఆ పార్టీని విమర్శించేలా లోక్‌సభ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) వ్యాఖ్యలు చేస్తున్నారు. కేరళలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనవైపే మొగ్గు ఉందని ఇటీవల సర్వే వెల్లడించిందంటూ ఆయన చేసిన పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలని హస్తం పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
‘‘సర్వేల్లో ఎవరో ఒకరు ముందువరుసలో ఉంటారు. అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తే.. దానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు. మా లక్ష్యం ఎన్నికల్లో గెలవడం. అనవసర వివాదాలపై ఆసక్తి లేదు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కె.మురళీధరన్ స్పష్టం చేశారు. థరూర్ (Shashi Tharoor) సర్వే గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీతో సీనియర్ ఎంపీ శశిథరూర్ బంధం రోజురోజుకీ మరింత బీటలు వారుతోంది. కాంగ్రెస్ (Congress) నేతలకు, ఆయనకు మధ్య కౌంటర్లు నిరంతరం కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ