ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు.సమావేశమయ్యారు
అమరావతి, 12 జూలై (హి.స.),ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం సుమారు గంటసేపు గవర్నర్‌తో చర్చించారు. ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి పెట్టుబ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు.సమావేశమయ్యారు


అమరావతి, 12 జూలై (హి.స.),ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం సుమారు గంటసేపు గవర్నర్‌తో చర్చించారు. ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలన కోసం చేపట్టిన చర్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రాజ్‌భవన్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande