అమరావతి, 12 జూలై (హి.స.)
: ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. ఇంతకు ముందు విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు సిట్‌కు ఇచ్చినట్లు చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్‌కాగా.. ఇవాళ విచారణ సమయంలో విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. ఈ రోజు ఆయన ఏం చెబుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. తనకు తెలిసిన అన్ని విషయాలను సిట్ అధికారులకు చెబుతానని గతంలోనే ప్రకటించారు విజయసారెడ్డి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ