అమరావతి, 12 జూలై (హి.స.)
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 10 అడుగుల నీటిమట్టం ఉండగా.. బ్యారేజి నుంచి 5లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ