అమరావతి, 12 జూలై (హి.స.)
శ్రీకాళహస్తి, : ‘జాతక దోషాలున్నాయి. డబ్బులు పంపితే దోషపూజలు చేయిస్తాం’ అంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు భక్తులను బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా రాహు, కేతు సర్పదోష నివారణ పూజల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి సంతరించుకున్న శ్రీకాళహస్తి కేంద్రంగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆలయంలో పనిచేసే అర్చకులకు ఈ తరహా ఫోన్లు రావడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ