ముదిగుబ్బ.లో సంచలనం సృష్టించిన విశ్వనాథ్ హత్య కేసులో ఐదుగురు అరెస్టు
ధర్మవరం,, 12 జూలై (హి.స.) ముదిగుబ్బలో సంచలనం సృష్టించిన తనకల్లు మండలం యర్రగుంటపల్లికి చెందిన విశ్వనాథ్‌ హత్య కేసులో ఐదుగురు నిందితులను ముదిగుబ్బ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. రూ.4 లక్షలకు సుపారీ ఇచ్చి అల్లుడిని మామే హత్య చేయించినట్లు విచారణలో
ముదిగుబ్బ.లో సంచలనం సృష్టించిన విశ్వనాథ్ హత్య కేసులో ఐదుగురు అరెస్టు


ధర్మవరం,, 12 జూలై (హి.స.) ముదిగుబ్బలో సంచలనం సృష్టించిన తనకల్లు మండలం యర్రగుంటపల్లికి చెందిన విశ్వనాథ్‌ హత్య కేసులో ఐదుగురు నిందితులను ముదిగుబ్బ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. రూ.4 లక్షలకు సుపారీ ఇచ్చి అల్లుడిని మామే హత్య చేయించినట్లు విచారణలో వెల్లడయ్యింది. ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ హేమంత్‌కుమార్, ముదిగుబ్బ అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ సీఐ శివరాముడు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande