వ్యర్థాల రీసైక్లింగ్ ను ప్రోత్సహించడానికి రాష్ట్రంలో వేస్ట్ రీసైక్లింగ్ ఇండస్ట్రియల్ పార్కుకు ఏర్పాటు
విశాఖపట్నం 12 జూలై (హి.స.) ,:వ్యర్థాల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి రాష్ట్రంలో ‘వేస్ట్‌ రీసైక్లింగ్‌ ఇండస్ట్రియల్‌ పార్కులు’ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య తెలిపారు. పారిశ్రామిక రాజధానిగా ఉన్న విశాఖలో ఒకటి, శ
వ్యర్థాల రీసైక్లింగ్ ను ప్రోత్సహించడానికి రాష్ట్రంలో  వేస్ట్ రీసైక్లింగ్ ఇండస్ట్రియల్ పార్కుకు ఏర్పాటు


విశాఖపట్నం 12 జూలై (హి.స.)

,:వ్యర్థాల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి రాష్ట్రంలో ‘వేస్ట్‌ రీసైక్లింగ్‌ ఇండస్ట్రియల్‌ పార్కులు’ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య తెలిపారు. పారిశ్రామిక రాజధానిగా ఉన్న విశాఖలో ఒకటి, శ్రీసిటీకి సమీపాన నెల్లూరు/చిత్తూరు జిల్లాలో మరొకటి ఏర్పాటవుతాయన్నారు. వీటివల్ల కొత్త పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. శుక్రవారం విశాఖ . పరిశ్రమల వ్యర్థాలు పూర్తిగా పనికి రానివి కావని, అవి ఉప ఉత్పత్తులని తెలిపారు. ఉదాహరణకు ఽథర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి వచ్చే బూడిద (ఫ్లై యాష్‌)ను ఫాల్జీ బ్రిక్స్‌ తయారీకి, సిమెంట్‌ కంపెనీల కు, హైవేల నిర్మాణంలోనూ వినియోగిస్తున్నారని చెప్పారు. అందుకే వ్యర్థాలను రీ సైక్లింగ్‌ చేసే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకొస్తోందన్నా రు.స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ‘క్లీన్‌ సిటీ’ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande