అమరావతి, 13 జూలై (హి.స.)
యానాం, తమిళనాడులోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం అరుణాచలంలో 116 గిరి ప్రదక్షిణాలు చేసి యానాంకు చెందిన కాకర్లపూడి కేశవవర్మ ఘనత సాధించారు. విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి అయిన ఆయన 2023 నుంచి ఇప్పటి వరకు 116 గిరి ప్రదక్షిణలు పూర్తి చేశారు. 2021లో కాకినాడ కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పదవీ విరమణ చేసిన కేశవవర్మ మంచి చిత్రకారుడు, రంగస్థల కళాకారుడు. పదవీ విరమణ సమయంలో తన గురువు సలాది గంగరాజు బహుమతిగా ఇచ్చిన భగవద్గీత చదవడం ప్రారంభించి భక్తిమార్గం వైపు అడుగులు వేశారు. 2023 ఆరంభంలో అరుణాచలం మొదటిసారి వెళ్లి 14.5 కి.మీ.ల గిరి ప్రదక్షిణ చేశారు. తర్వాత వెళ్లిన ప్రతిసారీ రెండుమూడుసార్లు ప్రదక్షిణ చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. శనివారం నాటికి 116 ప్రదక్షిణలు పూర్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ