రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది ప్రజలు జాగ్రత్త
హైదరాబాద్, 14 జూలై (హి.స.)సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా నేడు ‘రంగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందన్నారు. తన బిడ
రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది ప్రజలు జాగ్రత్త


హైదరాబాద్, 14 జూలై (హి.స.)సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా నేడు ‘రంగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందన్నారు. తన బిడ్డలను కాపాడుకుంటానని తెలిపారు. అలాగే.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు.

అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ సందర్భంగా పుష్పలత..‘బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నాను. కానీ ప్రతీ ఏడాది జరిగనట్టే ఈ ఏడాది కూడా ఆటంకం కలిగించారు. ప్రతీ సంవత్సరం చెప్పినప్పటికీ నన్ను లెక్క చేయడం లేదు. నా కోరికను ప్రతీ ఏడాది పక్కన పెడుతున్నారు. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. పూజలు జరిపించకపోతే.. నా కోపానికి మీరు బలి అవుతారు. నా బిడ్డలే కాబట్టి నేను కోపం చూపించడం లేదు. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు, నేను అడ్డురాను.

నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు. నాకు రక్తం బలి ఇవ్వడం లేదు. మీరు మాత్రం ఆరగిస్తారు. నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు. నాకు సరిగ్గా పూజలు చేయకపోతే రక్తం కక్కుకొని చస్తారు. అందుకే మరణాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది ప్రజలు జాగ్రత్త ఉండాలి. అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి’ అని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande