అమరావతి, 14 జూలై (హి.స.)
విజయవాడ: మద్యం కేసు నిందితులకు విజయవాడ కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఏ6 సజ్జల శ్రీధర్‌రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జిల్లా కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. సజ్జల శ్రీధర్‌రెడ్డి గతంలో బెయిల్ పిటిషన్ వేయగా.. దాన్ని కోర్టు కొట్టివేసింది. తాజాగా రెండోసారి వేసిన పిటిషన్‌నూ డిస్మిస్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ