అమరావతి, 14 జూలై (హి.స.)
గతంలో ఏపీ ఓ గంజాయి హబ్‌గా ఉండేదని హోంమంత్రి వంగలపూడి అనిత ) అన్నారు. సోమవారం నాడు హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారని.. అయితే గత ఏడాది కాలంగా తాము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగామన్నారు. ఈగల్ అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రతిపాదించారని చెప్పుకొచ్చారు. ఈగల్ స్థాపించినప్పటి నుంచి రవికృష్ణను డైరెక్టర్‌గా చేసి వర్క్‌ను ప్రారంభించామన్నారు. వైజాగ్ , విజయవాడ, రాజమండ్రిలో మూడుఈగల్టీంలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఏజెన్సీ నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని.. ఈరోజుకు 831 గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ