అమరావతి, 13 జూలై (హి.స.)
అమరావతి: త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన అజెండాగా ఈనెల 26 నుంచి 30 వరకు అక్కడ ఆయన పర్యటించనున్నారు.
రాజకీయ, వ్యవస్థీకృత, వ్యాపార వర్గాలతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పన, భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్, అధికారులు కాటమనేని భాస్కర్, ఎన్ యువరాజ్, కార్తికేయ మిశ్రా, కె కన్నబాబు, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు నుంచి సాయికాంత్ వర్మ సింగపూర్ వెళ్లనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ