ఎవరితో పెట్టుకున్నా టీచర్లతో పెట్టుకోవద్దు.. ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
హుజురాబాద్, 13 జూలై (హి.స.) ఎవరితో పెట్టుకున్నా టీచర్లతో మాత్రం పెట్టుకోవద్దని ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో టీచర్ అచ్చే మురళి పదవీ విరమణ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన
ఎంపీ ఈటెల


హుజురాబాద్, 13 జూలై (హి.స.)

ఎవరితో పెట్టుకున్నా టీచర్లతో మాత్రం పెట్టుకోవద్దని ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో టీచర్ అచ్చే మురళి పదవీ విరమణ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. టీచర్లు, ప్రభుత్వ పాఠశాలల గురించి ఈ మధ్య ఎక్కువ చర్చ జరుగుతోందన్నారు. ప్రవేట్కి పంపించిన తల్లిదండ్రులు అప్పులపాలై మళ్లీ ప్రభత్వ పాఠశాలలవైపే చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వారు క్వాలిఫైడ్ టీచర్లు, కమిట్మెంట్ తో పనిచేస్తున్నారని, స్కూల్స్ లో పిల్లల సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఉండే సామాజిక స్పృహ, మానవ సంబంధాలు, ఏదన్నా చేయాలనే తపన కాన్వెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలకు ఎక్కువ ఉండదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande