పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ, మంచిర్యాల. 13 జూలై (హి.స.) మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తానూ గతంలో ఐ ప్రాంతంలో పాదయాత్ర చేసినపుడు ప్రజలకు ఇచ
భట్టి విక్రమార్క


తెలంగాణ, మంచిర్యాల. 13 జూలై (హి.స.)

మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తానూ గతంలో ఐ ప్రాంతంలో పాదయాత్ర చేసినపుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఆసుపత్రి ప్రారంభం ద్వారా లక్షెట్టిపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, స్థానిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడమే లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande