విద్యార్థులు కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ, నల్గొండ. 13 జూలై (హి.స.) కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించే బాధ్యత మీరు తీసుకుంటే మౌలిక వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసే బాధ్యత నాది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూ
ఎమ్మెల్యే కోమటిరెడ్డి


తెలంగాణ, నల్గొండ. 13 జూలై (హి.స.)

కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించే బాధ్యత మీరు తీసుకుంటే మౌలిక వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసే బాధ్యత నాది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కేజీబీవీ కి వెళ్లిన ఆయన విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం వారికి తగినట్లుగా గదులు మౌలిక సదుపాయాలు లేకపోవడం తదితర విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలో బాత్రూమ్స్, డార్మిటర్ హాల్ విద్యార్థులు పడుకోవడానికి సరిపడా రూములు లేకపోవడంతో సొంత నిధులతో ఫస్ట్ ఫ్లోర్ పై నాలుగు రూములు, సరిపడా బాత్రూమ్స్ రేపటి నుంచే ప్రారంభించాలని తన వ్యక్తిగత ఇంజనీర్ కు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande