ఏజెన్సీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా : మంత్రి గడ్డం వివేక్
తెలంగాణ, ఆదిలాబాద్. 13 జూలై (హి.స.) ఏజెన్సీ గిరిజనేతరులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్
మంత్రి గడ్డం వివేక్


తెలంగాణ, ఆదిలాబాద్. 13 జూలై (హి.స.)

ఏజెన్సీ గిరిజనేతరులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రాన్ని ఆయన పర్యటించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం త్రిరత్న బుద్ధ విహార్లో గౌతమ బుద్ధుని ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా బహుజన నాయకులు ఏజెన్సీలో ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించారు. ఏజెన్సీలో సాగు చేసుకుంటున్నా భూములకు పహాణీలు ఇవ్వాలని, మెరుగైన విద్య కోసం ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయాలని, ఇరిగేషన్ కోసం ఎంపల్లి ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరారు. అంబేద్కర్ భవనం, బంజారా భవనం, షాదీఖానా వంటి భవనాలు మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande