రిజర్వేషన్ అమలుకు బీజం పడిందే కామారెడ్డిలో..మహమ్మద్ అలీ షబ్బీర్
తెలంగాణ, కామారెడ్డి. 13 జూలై (హి.స.) వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం రాష్ట్రంలో ఓచరిత్ర అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం నాడు ఆయన కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో పాల శీతలీకరణ కే
మహమ్మద్ అలీ షబ్బీర్


తెలంగాణ, కామారెడ్డి. 13 జూలై (హి.స.)

వెనుకబడిన తరగతుల వారి కోసం

ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం రాష్ట్రంలో ఓచరిత్ర అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం నాడు ఆయన కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34, 35 శాతం బీసీలకు ఉన్న రిజర్వేషన్లను, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ రిజర్వేషన్ల కోటాను పెంచుతారని ఎంతో ఆశపడ్డారన్నారు. కానీ అప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్లను 22 కి తగ్గించి అన్యాయం చేశాడని మండిపడ్డారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande