కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు.. పలు దుకాణాలు సీజ్
హైదరాబాద్, 13 జూలై (హి.స.) ఆదివారం ఉదయం హైదరాబాద్లో కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ముషీరాబాద్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో దాడులు చేపట్టారు.
ఎక్సైజ్ శాఖ


హైదరాబాద్, 13 జూలై (హి.స.)

ఆదివారం ఉదయం హైదరాబాద్లో కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ముషీరాబాద్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో దాడులు చేపట్టారు.

శేరిలింగంపల్లి మండలం సిద్దిక్ నగర్లో ఉన్న ఓ కల్లు కాంపౌండ్ను తనిఖీ చేసిన అధికారులు, అనుమతి లేకుండా నడుపుతున్నట్లు గుర్తించి దుకాణాన్ని సీజ్ చేశారు. యజమానిపై కేసు నమోదు చేశారు. అలాగే మూసాపేట్, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లో ఉన్న ఇతర కల్లు కాంపౌండ్లలోనూ దాడులు చేసి శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపారు.

ముషీరాబాద్లో మూడు, కాచిగూడలో రెండు కల్లు డిపోలపై దాడులు జరిగాయి. కల్లు కాంపౌండ్ల నిర్వాహకులకు ఎక్సైజ్ అధికారులు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. డిపోల నుంచి సరఫరా అయ్యే కల్లును మాత్రమే నిల్వ చేసి విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మత్తు పెంచేందుకు అలోజలం వంటి రసాయనాలను కలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande